Pavani5’s Weblog

ఫిబ్రవరి 29, 2008

మంచి భోజనంలాంటి సినిమా

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 4:53 అపరాహ్నం

“పక్షీగోపి” అనే  సినిమా audio release అయినతర్వాత pressmeet ఏర్పాటు చేసారు. ఆ pressmeet లో మాట్లాడడానికి మన సినీ దర్శకులు భ్రాంతి రెడ్డి, నిర్మాత ధీమా చౌదరి, కధానాయకుడు  నిరీక్షిత్ , కధానయకి దన్నుశ్రీ పాల్గొన్నారు.
మీడియా ప్రతినిధులూ పాల్గొన్నారు.
ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి సమాధానంగా……
మన దర్శకులు భ్రాంతి రెడ్డి  ఇలా వివరించారు…..

 మా సినిమా అన్ని సినిమాల్లాగా వుండదండి, చాలా different గా వుంటుందండి. routene ki భిన్నంగా వుంటుంది. 
అంతలో మన నిర్మాత గారు అందుకొని
అసలు మేము ఎక్కడ compramise అవలేదండి…..
మీడియా ప్రతినిధులు మన నిరీక్షిత్ ని కదిలించగా…….
 నిరీక్షిత్:  ya సినిమా చాలా బాగ వచ్చిందండి. actually ఇందులో ఆరు పాటలు వున్నాయి అన్ని కూడా వేరె వేరె locations చేసాము అనగానే
మన నిర్మాత అందుకొని
అసలు మేము ఎక్కడ compramise అవలేదండి…..
మళ్ళి మన దర్శకులు అందుకొని ఆరు పాటలు కూడా ఆరు ఆణిముత్యాలండి, చాలా బాగా వచ్చాయండి.
ఒక మీడియా ప్రతినిధి మన కధానాయకుడు  నిరీక్షిత్ ని పాటల గురించి అడగగా…
ya ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయండి, music directer గోంగూర గారు చాలా చక్కగా బాణీలు కట్టారు. అలాగే కొరియొగ్రాఫర్ చక్కని steps create చేసారు. నాకు నచ్చిన పాట అంటే…..

“పక్షీగోపి నా ముష్టి గోపి…..
వుడతల రాధ నా పిడతల రాధా…”

అనే పాటా నాకు నచ్చింది, ఇప్పటికే ఈపాట చాలా హిట్ అయింది మీరూ వినేవుంటారు. ఈపాట location కోసం మేం చాలా places చూసాము అనగానే మన…
అసలు మేము ఎక్కడ compramise అవలేదండి…..
మీడియా ప్రతినిధి ఒకరు కధానాయకి గురించి చెప్పమని దర్శకులని అడగగా…
ఆ అమ్మాయి చాలా బాగా చేసిందండి. actually ఈ అమ్మాయి ని అండమాన్ కి చెందింది,  అనగానే మన నిర్మత గారు ….
అసలు మేము ఎక్కడ compramise అవలేదండి…..costumes తో సహ….
కధానయిక గురించి మన నిరీక్షిత్ ని అడాగగా…..
ya ఆ అమ్మాయి కి language రాకపోయినా ఈజీగ act చేసింది, చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి మంచి futere ఉంది.ఇక సినిమా విషయానికి వస్తే చాలా బాగా వచ్చింది. అనగానే మన నిర్మాత …..
అసలు మేము ఎక్కడ compramise అవలేదండి…..( హి హి హి )
మీడియా ప్రతినిధి ఒకరు కధానాయకిని పలకరించారు…
ఇక మన అమ్మాయి గారు అందుకుంది..
అంద్ రికి నమష్కారం…
య ఐ థేంక్ మై డిరెక్టర్ గారు, ఐ థేంక్ మై ప్రొడ్య్ జర్ గారు,
ఐ థేంక్ మై హీరో నిర్ర్ క్షిథ్ (సిగ్గుపడుతూ)
దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవి ఇన్ ఠెలుగు,
నిర్ర్ క్షిథ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ & స్పోర్టీవ్,
థేంక్యు ఫర్ గివింగ్ మి దిజ్ ఒపర్చ్యునిటి..
చివరగ మన నిర్మాత మాట్లాడుతూ….
అయ్యలారా అమ్మలారా ఈ మీడియా ద్వారా మీఅందరికి నే చెప్పదలుచుకునేది,
ఈ సినిమా మీ నాన్నో, మీ బాబాయొ, తీసారనుకొని యధాశక్తితో అందరూ చూసి నా డబ్బులు నాకు వచ్చేటట్టుగా చూస్తారని ఆశిస్తున్నాను. ( ఏదారి లేనట్టు మొహం పెట్టి…..) ( హి హి హి )

ఫిబ్రవరి 27, 2008

ఎలా ఎలా ఎలా………!

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 2:23 అపరాహ్నం

వెలుగు లేని వెన్నెలేల …………….?

కలలు లేని కన్నులేల ……………..?

దేవుడు లేని కోవెలేల ………………..?

ప్రాణం లేని జీవి ఏల …………..?

బాధ లేని సుఖమేల ………….?

వుప్పు లేని కూర ఏల ……………?

శీర్షిక లేని బ్లాగు ఏల ……………….?

మీ కామేంట్స్ లేని నా శీర్షిక ఏల ………..? 

ఫిబ్రవరి 25, 2008

ఇది ఒక ఒక ఒక …….

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 3:12 అపరాహ్నం

కళ్ళు నావి చూపు నీది ……………

పెదవి నాది మాట నీది ………….

గుండె నాది శ్వాస నీది ………….

మనసు నాది అలజడి నీది ……..

ఇదేనేమో………..???

సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అంటే…….

ఫిబ్రవరి 20, 2008

……..?

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 4:40 అపరాహ్నం

What is the relation between SNAKE & COIN……………..?

నా వీర బాదుడు – 2

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 4:30 అపరాహ్నం

సీతరావమ్మ — చిల్లరకొట్టు        

       మా వూరిలో వున్న ఏకైక షాపు అది, షాపు యజమానురాలి పేరు సీతారావమ్మ అవడంతో ఆ షాపుకి సీతారావమ్మకొట్టు అనేపేరు స్తిరపడిపోయింది. ఆవిడకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ప్రతిరోజు ఆకొట్లో జరిగే తతంగం చాలా గమ్మత్తుగా వుండేది. ఆకొట్టు చాలా చిన్నది కావడంతో, కొట్లో కావలసిన వస్తువులు ఏరోజువి ఆరోజే తెచ్చేవాళ్ళు. ప్రతి రోజు కొడుకు ప్రసాదు పెన్ను పేపరు తీసుకొని కావలసిన వస్తువుల లిస్టు చెప్పమని తల్లిని అడిగేవాడు. ఇక వారి సంభాషణ ఎలా ఉండేదంటే ………………

ప్రసాదు : అమ్మా, ఎచ్చాలు ఏం తేవాలే……?
సీ.రా   :  ఏం తెత్తా, డబ్బులే లేవు ఆడ……    
ప్రసాదు:  ఎయ్యెకటి తేకపోతే కొట్టు మూసుకోవాల….. చెప్పు చెప్పు…….
సీ.రా   : సర్లే   అయి కాసిని అయి కాసిని తే…..
ప్రసాద్  : కంది, మినప, పెసర, శనగ పొప్పులు….
సీ.రా   : డబ్బులే లేవురా అంటే, అన్ని తెత్తావంటావేంది…..
          సర్లె అయ్యె రెండు కిలోలు, అయ్యె రెండు కిలోలు తే..
ప్రసాద్  : బిస్కొట్లు, బిళ్ళలు, చక్రాలు…
సీ.రా   :  డబ్బులే లేవురా అంటే … సర్లే బిస్కోట్లు రెండు పాకెట్లు, బిళ్ళలు రెండు పాకేట్లు, చక్రాలు మూడు పాకేట్లు తే….
ప్రసాదు:   పందార, కాపిబిళ్ళలు, కాప్పోడి ……..?
సీ.రా :  ఏందిరా ఆడ వున్నయె ఎయ్యి రూపాయలంటే అన్ని తెత్తావంటావేంది….. 
         కాప్పోడి వుందిలే గాని, కాపి బిళ్ళల పొట్టం ఒకటి, పందార మూడు కిలోలు ఏస్కో అట్టాగే అగ్గిపెట్టెలు కూడా ఏస్కోరోయి.

ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే వీరబాదుడు…. వీరబాదుడే……………

(ఐపోయిందనుకుంటున్నారా…………??)

ఫిబ్రవరి 19, 2008

నా వీర బాదుడు 1……

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 10:06 పూర్వాహ్నం

ఆ రోజు మొదటి సారి బడిలో అడుగు పెట్టాను. అప్పటి దాకా రోజు హాయిగా ఆడుకొనే నాకు, బడి ఒక జైలు లాగా అనిపించింది. ఈ కాలంలో అయితే పిల్లలకి, అమ్మని గుర్తుపట్టే వయసు కూడా రాకముందే బళ్ళో వేస్తున్నారు, కాని నా చిన్నప్పుడు మాకు బాగ ఊహ తెలిసాకే బడికి పంపేవారు. దాంతో బడి అలవాటు కావాలంటే కాస్త సమయం పట్టేది. బళ్ళో చేరకముందే మా నాన్న గారు నాచేత అన్నయ్యల పాత పుస్తకాల్లోని  కొన్ని పద్యాలు నేర్పించారు. దాంతో చదువు కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. కాని మాస్టార్లని చూస్తేనే వణుకు వచ్చేది. మా స్కూలే విచిత్రంగా వుండేది, రెండు నిట్ట్ర్రాళ్ళ పాకలో ఒకటి, రెండు, ఐదు తరగతులు వుండేవి. ఒకటో తరగతి కి, గుంటూరు నుండి teacher వచ్చేవారు, రెండవ తరగతికి మావూరి లోనే christian భార్య భర్తలు  teachers గా వుండేవారు. మూడో తరగతికి కోటేశ్వరరావు మాస్టారు, నాల్గవ తరగతికి నాగేశ్వరరావు మాస్టారు గుంటూరు నుండి వచ్చేవారు, ఐదో తరగతికి ఆ వూరిలోని ఆంజనేయులు మాస్టారు ఈయనే స్కూలుకి Headmaster.

   రెండవ తరగతి చదవాలంటే మాత్రం అందరికి హడల్, ఆ క్లాసు మాస్టారంటే చచ్చేంత భయం అందరికి.చదువు సంగతి ఎలా వున్నా పండగలు వస్తే మాత్రం మాస్టారు ఒక గంప పక్కన పెట్టుకొని పిల్లలని ఇంట్లో చేసిన పిండి వంటలు తెచ్చి అందులో వేయమనే వారు. ఎవరైనా తేకపొతే వాడి వీపు విమానం మోతే ! కొందరు పిల్లలు వాళ్ళు తినడానికి తెచ్చుకున్నవి గంపలో వేసేవాళ్ళు.

      నాలుగో తరగతిలో వుండగా ఒకసారి విహార యాత్రకి జాగర్లమూడి  వెళ్ళాము.  చాలా సరదాగా గడిపాము. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి జ్వరం వచ్చేసింది. ఇక ఐదవ తరగతికి వచ్చాక డాబా బడి కట్టారు, దాని ప్రారంభొత్సవానికి గుంటూరు నుండీ ఎవరో పెద్దవాళ్ళని తీసుకువచ్చారు. నన్ను ఇంకొ అమ్మాయిని వందేమాతరం పాడమని నాగేశ్వరరావు మాస్టారు చెప్పారు, మేము ఇద్దరం కూడా పిరికి వాళ్ళమే, ఆ పెద్దవాళ్ళముందు వూరి జనం ముందు పాడాలంటే మాకు కాళ్ళలోంచి వణుకు వచ్చింది. అయినా తప్పలేదు మాస్టారు బలవంతం మీద తలకాయ వంచుకొని కళ్ళు మూసుకొని పాడేసాం.

(ఇంకావుందా…….. ఏమో)

ఫిబ్రవరి 15, 2008

నా వీర బాదుడు ……..

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 3:29 అపరాహ్నం

FREINDS అందరికి నమస్కారం. మీ అందరికి ఒక పల్లెటూరు గురించి ఆ వూరిలో నా జ్ఞాపకాలు  చెప్పాలని అనుకుంటున్నాను. ఆ వూరి పేరు లాలుపురం. అది గుంటూరు కి రెండు మైళ్ళ దూరంలో వుంది. ఆ వూరిలోకి  ప్రవేశిస్తూనే  కళ్ళని కట్టిపడేసే ఎర్రని మిరప చేలు, మధ్య మధ్య లో ముద్దబంతి పూల చెట్లు కనిపిస్తాయి. అలానే తెల్లని పత్తి చేలు, పొగాకు, జొన్న, సజ్జ, అన్ని రకాల ధాన్యాల చేలు, వూరి నలుదిక్కులా చూడవచ్చు. ఇలా వూరంతా పచ్చగా చూసినకొద్ది చూసేలా ఉంది. వూరిలో ఒక చెరువు, చెరువు గట్టు మీద పెద్ద పెద్ద రావి చెట్లు ఉన్నాయి. ఆ పక్కన కొద్ది దూరం లో పెద్ద మంచి నీటి బావి వుంది. వూరి అంతటికి ఈ బావి నీరే ఆధారం. బావి పక్కన కొద్ది దూరంలో ఆంజనేయస్వామి దేవాలయం, ఆ ఆవరణలోనే గుడి వెనక రెండు గదుల పెంకుటిల్లు, ఒక చిన్న పూరిల్లు, కొంత ఖాళీ స్తలం, అందులో రెండు వేప చెట్లు, రెండు కొబ్బరి  చెట్లు, ఒక బాదం చెట్టు, కొన్ని పూల చెట్లతో ఆ ఆవరణ ఎంతో ఆహ్లాదంగా వుంది…..

     ఆరో్జు  నేను, అమ్మ, నాన్న, ఇద్దరు అన్నయ్యలు, బండి లో ఆ వూరు చేరుకున్నాము. ఆ వూరు నాకు చాలా నచ్చింది. గుడి అరుగు ఆ ఆవరణ అంతా ఆడుకోవడానికి నాకు బాగా నచ్చింది, రోజూ ఇక్కడే వుంటే బాగుణ్ణు అనుకున్నాను. ఆ కాసేపట్లో  ఆ వూరి పిల్లలతో స్నేహం కుదిరింది. అంతలోనె చీకటి పడిపోయింది ఈ లోపల అమ్మ పిలిచింది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలని దిగులుగా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ అన్నం పెట్టింది, ” అన్నం తిని ఇంటికి వెళ్ళిపోవాలా అమ్మా ..?” అని అడిగాను, దానికి అమ్మ నవ్వేసి, లేదమ్మా మనం ఇక ఇక్కడే వుంటాము అని చెప్పింది. నిజంగానా అని అడిగాను అవును అని చెప్పింది అమ్మ. ఇంక నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక అన్నం తిని నిద్ర పోయాను, నిద్ర లేచేసరికి నాన్న గుడిలో అర్చన చేస్తున్నారు, అమ్మ ఇంటి పని చేస్తోంది. కొన్ని రోజులకి నన్ను బడిలో చేర్చారు. ఇక అప్పుడు మొదలయ్యాయి నాకు కష్టాలు. ఒకట రెండా ఎన్నని చెప్పను……..

(  సశేషం)

ఫిబ్రవరి 13, 2008

నెయ్యి-పులగం…..

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 11:54 పూర్వాహ్నం

 అది ఒక చిన్న పల్లెటూరు, ఆ ఊరిలో ఒక రైతు వుండేవాడు. అతను ఒక రోజు సాయంత్రం పొలానికి వెళుతున్నాడు. దారిలో అతని చిన్ననాటి స్నేహితుడు ఊరి నుండి వస్తూ కలిసాడు, ఇద్దరు కుశల ప్రశ్నలు వేశుకొని కాసేపు కబుర్లాడుకొని, స్నేహితుడికి రైతు “మా ఇంటికి వెళ్ళు, ఇంట్లొ పులగం వుంది” అని చెప్పాడు. సరె అనుకొని ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. పులగం అంటే చచ్చేంత ఇష్టం వున్న స్నేహితుడికి పులగం పేరు వినగానే నోట్లో నీళ్ళూరాయి. లొట్టలు వేసుకుంటు ఇంటికి చేరాడు.
    ఇంటికి వచ్చిన స్నేహితుడిని, రైతు భార్య సాదరంగా ఆహ్వానించి, కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు ఇచ్చింది. తాగడానికి మజ్జిగ ఇచ్చింది. అతని భార్య పిల్లల గురించి కుశల ప్రశ్నలు వేసింది, భోజనాల సమయం సమీపిస్తుండగా అతిధిని ఇలా అడిగింది “అన్నయ్య గారు భోజనం వడ్డించమంటారా లేక నెయ్యి వచ్చిందాకా ఆగుతారా…….?” అని అడిగింది. అతను మనసులో పులగం లోకి నెయ్యి లేకపోతె ఏం బాగుంటుంది అని అనుకొని, నెయ్యి వచ్చాకే భోజనం చేద్దాం అని అన్నాడు. ఒక అరగంట తర్వాత రైతు ఆవుని తోలుకొని ఇంటికి చేరాడు. భార్యతో చుట్టాన్ని కట్టేసి దయ్యాన్ని విడువు అని చెప్పాడు. ఆ మట విన్న స్నేహితుడు చుట్టాన్ని కట్టేయడం ఏమిటో దయ్యాన్ని విడవడం ఏమిటో అర్దం కాక పరుగు లంకించుకున్నాడు………..   

 అతను ఎందుకు పరుగెత్తాడో మీకేమైనా అర్దం అయ్యిందా……………..???

విషయం ఏమిటంటే………
ఈ కధలో రైతు పేరు నెయ్యి, భార్య పేరు పులగం, వారికి అద్రుష్టం కలిసివస్తుందని విక్రుతానంద స్వామీజి చెప్పడం వల్ల వారు అలా పేర్లు మార్చుకోవలసి వచింది,ఇక చుట్టం అంటే ఆవు దయ్యం అంటే దూడ…….
ఈ విషయం తెలియని నెయ్యి స్నేహితడు, పులగం తినాలనుకొని ఎంతో ఆశతో వచ్చి విషయం తెలియక భయంతో వెళ్ళిపోయాడు….

ఫిబ్రవరి 10, 2008

తు౦టరి ఇంటర్వూ

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 3:19 అపరాహ్నం

టెలివిజన్ లో ఒక ప్రఖ్యాత క్రీడాకారుడి పరిచయ కార్యక్రమం ప్రసారమవుతోంది……

మొదటి పది నిమిషాలు అతడి గురించి ప్రేక్షకులకు వివరించి, పరిచయం మొదలు పెట్టాడు మన పరిచయ కర్త…

ప.క:    నమస్కారమండి కపి గారు.
కపి :    నమస్కారమండి..
ప.క:    కపి గారు మీరు ఈ కోతి కొమ్మచ్ఛి ఆటనే ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి..?
కపి :    (సంతోషంతో…)  నేను……..
ప.క:    బహుశ ఈ ఆట మీరు, కోతి నుండి మనిషి పుట్టాడనే విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ క్రీడ మీద ఆసక్తి పెంచుకొని వుంటారు.             అవునా..?
కపి :    అవునండి..
ప.క:   ఈ ఆట ఆడేటప్పుడు మీ ఫీలింగ్స్ గురించి వివరిస్తారా…?
కపి :    అది……..
ప.క:   నేను ఒక పత్రిక లో చదివానండి. మీరు ఈ ఆట ఆడినప్పుడల్లా, మీ చిన్నప్పుడు మీరు తింటున్న అరిటి పండుని లాక్కెళ్ళిన           కోతిని  గుర్తు చేసుకుంటారని, అదే మీరు ఆదర్శంగా తీసుకున్నారని…… నిజమేనా..?
కపి :   నిజమేనండి   (తెలిసీ ఎందుకో అడగటం అనుకొంటూ…)
ప.క:   ఈ ఆటలో తగిలిన గాయాలకు మీరు ఆకు పసరు మందులే ఎందుకు వాడతారు..?
కపి:    (అసహనంగా)  ఈ ఆట ….
ప.క:   బహుశ ఈ ఆట ప్రక్రుతి సిద్దమైన ఆట కాబట్టి ప్రక్రుతి సిద్దమైన పసరు మందులే వాడతారు అనుకుంటాను….. కరక్టేనా..??
కపి :   మ్…….
          మన కపి గారికి సహనం నశిస్తోంది……                                                                              ప.క:   కపి గారు, యువ క్రీడాకారులకి మీరు శిక్షణ ఇస్తున్నారని విన్నాము. ఆ వివరాలు తెలియచేస్తారా మా ప్రేక్షకులకి.
కపి:    మరీ…..
ప.క:   మీరు తక్కువ ఫీజులతో, పేద విద్యార్దులకి అతి తక్కువ ఫీజులతో శిక్షణ ఇస్తున్నారని.. దీని కొసం మీరు కొంత స్తలాన్ని           కొన్నారని, దాంట్లో పెద్ద పెద్ద చెట్లు పెంచుతున్నారనీ, అక్కడే శి ఇస్తున్నారనుకుంటాను…
కపి :   (మన కపి గారు తల పట్టుకొని ఎంచెప్పాలొ అర్దం కాక ఏడుపు మొహంతో) నిజమే….
ప.క:   మీరు మన యువ క్రీడాకారులకి ఇచ్చే సూచన మరియు సలహాలు…..?
కపి:    ఇప్పుడు…..
ప.క:   ఇప్పుడు మీరు ఏంచెప్పబోతున్నారంటే……. సాధించిన విజయాలకి పొంగిపోకుండా, సాధించాల్సింది ఎంతో ఊందని తెలుసుకొని           ముందుకు సాగాలని, ఈ ఆటలొ నైపుణ్యం సాధించి, కోతి కొమ్మచ్చి ఆట ఏ అంతర్జాతీయ క్రీడకి తీసిపోని భారతీయ క్రీడ అని           ప్రపంచానికి తెలియచెప్పాల్సిన బాధ్యత మీదే అని …….. కరక్టేనా..?
కపి :   ( ఏడవలేక నవ్వుతూ అవునన్నట్టు తల ఊపాడు)
         నాకన్నా ఎక్కువ విషయాలు వీడికే తెలిసినట్టున్నాయ్….
ప.క:   కపి గారు చివరగా ఒక ప్రశ్న..! కపి అనేది మీ అసలు పేరేనా…??
కపి :   నా పేరు…
ప.క:   బహుశా మీ అసలు పేరు కపిల్ అయి వుంటుంది…. ఆటలో మీ ప్రావీణ్యం చూసి మీ అభిమానులు అలా పిలుచుకుంటారు               అనుకుంటాను, అవునా…..
కపి:   (చి చ్చీ….) హి హి హి హి
ప.క:   మీ ఆమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా మంచి విషయాలు తెలియజేసారు… నమస్కారమండి..!
కపి:    (నేనెం చెప్పాను……???)   నమస్కారమండి

ఇది తిరగబడితే…….

ప.క:    నమస్కారమండి కపి గారు.
కపి :    నమస్కారమండి..
ప.క:    కపి గారు మా మొదటి ప్రశ్న….
కపి :    మీరు ఏం అడగాలనుకుంటున్నారంటే….. నేను ఈ కోతి కొమ్మచ్ఛి ఆటనే ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి..? అంతేనా..
ప.క:    అవునండి….
కపి :    కోతి నుండి మనిషి పుట్టాడనే విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ క్రీడ మీద ఆసక్తి పెంచుకొన్నాను

మిగతా సంభాషణ ఎలా వుంటుందో ఊహించండి…….   

ఫిబ్రవరి 8, 2008

PALs

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 1:45 అపరాహ్నం

we never met eachother ……..!

koodali brought us together ………!

we may or maynot meet in future …….!

but let us not forget eachother ………!

పాత టపాలు »

WordPress.com లో Blog పెట్టుము.