Pavani5’s Weblog

మార్చి 27, 2008

చిం చిం చూయింగ్…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:07 పూర్వాహ్నం

అబ్బబ్బ రోజు ఈ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నా, అత్తయ్య ఓ అత్తయ్యా ఏమ్ చేస్తున్నారు ..? కొంచెం టిఫిన్ బాక్సులు సర్దుతారా..?
అబ్బబ్బ వుండవె టీవీ చూస్తున్నా
(ఒక్క వుదుటున కుమారి ఒక చేతిలో గిన్నె మరో చేత్తొ గరిటతొ టీవీ ముందు ప్రత్యక్షం. ఆ తొందరలో గుమ్మం తగిలి ధడేల్ మని ముందుకు పడబోయి నిలదొక్కుకుంది, కాని చేతిలోని గిన్నెలో వున్న పదార్ధం కాస్త అత్తగారి మొహం మీద పడింది) ఏంటే ఇవాళ్ళ పప్పు ఇలా చేసావ్..?
అయ్యో అత్తయ్య అది పప్పు కాదండీ “చిమ్ చిమ్ చూయింగ్” అని చైనా వంటకం నిన్ననే టీవీలో చూపించారు. ఎలా వుంది టేష్ట్ ..?
ఎమే టిఫిన్ రెడీ అయిందా..? ఆఫీసుకి  టైం అయింది..
అమ్మా జడ వెయ్యవా.. ఆటో వచ్చే టైమ్ అయ్యింది.
అబ్బబ్బ వస్తున్నా..
అత్తయ్య వరుణ్ తరుణీకీ విడాకులు ఇస్తాడంటారా..
నిన్ననే కదే పెళ్ళైంది, అప్పుడేనా..(టీవి సీరియల్ లో)
అమ్మా  స్కూలుకి టైం అయింది షూస్ ఎక్కడున్నాయి..
వస్తున్నారా..
అమ్మగారు తొందరగా గిన్నెలు వేయండి తొందరగా వెళ్ళాలి.
ఎందుకే అంత తొందరా..?
అయ్యో మీకు తెలీదా అమ్మా ఇవ్వాళ్ళ డీటీవీ లో పక్షిగోపి సినిమా ఏస్తునారు.
అవునా, ఎన్నింటికి..?
తొమ్మిదింటికమ్మా..
ఏరా అబ్బాయి నువ్వు ఈ టీవీ కనెక్షన్ తీయిస్తావా లేదా..
ఏమైంది నాన్నా ఈటీవీ సరిగ్గా రావట్లేదా..?
నీబొంద ఈటీవి అంటే అది కాదు, ఆ దరిద్రపు కేబుల్ కనెక్షన్ తీయిస్తావా లేదా..
లేకపోతే నేనె వెళ్ళి వాడితో చెప్పనా.
ఏమైంది నాన్న ఇప్పుడు..
ఏమైందా నా బొందైంది నా శార్ధమైంది పొద్దున్న లేచింది మొదలు అత్తా కోడళ్ళు  ఇద్దరూ ఆ టీవీకి అతుక్కుపోతారు, వీళ్లకి ఎందులో సఖ్యత కుదరదు కాని టీవీ విషయంలో మాత్రం ఎంత కో-ఆపరేషనో చెప్పక్కర్లేదు, ఒకరు పనిలో వున్నప్పుడు ఒకళ్ళు ఫాలో అవుతారు ఆ ప్రోగ్రామ్స్ ని, అక్కడితో ఆగితే పర్లేదు కాని ఆ దరిద్రపు ప్రోగ్రాములమీద చర్ఛ ఒకటి.
అయినా నెలరోజులకి తెచ్చిన సరుకులు పది రోజులే వస్తున్నయి ఎందుకో అలోచించావా..
నిజమే నాన్నా ఎందుకంటావ్..
పిచ్చిచచ్చినాడా నన్నడుగుతావేంట్రా,
ఏమండీ…..
అదిగొ మీ ఆవిడ పిలుస్తోంది వెళ్ళి ఆ ముదనష్టం ఏదో తినిరా అదేంటో  “చిమ్ చిమ్ చూయింగ్” అంట నా బొంద
చిమ్ చిమ్ చూయింగా  అంటే ఏంటి నాన్నా చూయింగమా
ఆ ఆ అలాంటిదే, ఆ టీవీ వాళ్ళు చూపించటం వీళ్ళు చేయటం మన ప్రాణానికి వచ్చిందిరా. అయినా నిన్ను అని లాభం లేదు ఆ వంటలు తిని తినీ నీబుర్ర కూడా పోతోంది. సరె సరె ఈగొడవ రోజూ వుండేదే కాని ఆఫీసుకి టైం అయిందేమో నువ్వు  వెళ్ళు.
ఏదే బాక్సు ..
అయ్యో ఇంకా పెట్టలేదండి
ఇంకా పెట్టలేదా మరి పిలిచావ్
అదీ బాక్సులో అన్నం పెట్టానండి
ఇంకేమ్ కూర వేసి ఇచ్చేయ్..
అదేనండి గరిటే గిన్న నుండి వూడి రవట్లేదు కొంచే తీసిపెట్టరూ..
సరె సరె నాకు టైం లేదుకాని ఇవ్వాల్టికి బాక్సు వద్దులే, పిల్లలకి కూడా బయట ఏదో ఒకటి పెట్టిస్తాలే, కాని కుమారి ఒక్క విషయమే కనీసం బాక్సుల్లోనైనా మామూలు వంటలు చేయ్యవే. పిల్లలు కూడా ఎలా సన్నపడిపోతున్నారో చూడు. నాన్న నాలుగు కేజీలు బరువు తగ్గాట్టే, కాస్త మా అరోగ్యాలు కూడా పట్టించుకోండే. సరె నేను వెళ్ళొస్తా…
అమ్మా గిన్నెలు తోమేసాను నేను పోతున్నా .. బట్టలు మధ్యాన్నం వచ్చి వుతుకుతా అప్పుడే ఇల్లు కూడా తుడుస్తానమ్మ
సరేనే త్వరగా వచ్చేయి.
మావయ్య గారు కాఫి ఇవ్వనా.. టిఫిన్ పెట్టనా..
టిఫినా ఏ దేసపు పదార్ధం అమ్మా అది..
వుప్పిడ్లీ అండి..
వుప్పిడ్లీనా అంటే వుప్పుతో ఇడ్లీ చేసావామ్మా..?
కాదండి నిన్న ఉపోషాలు కదా రాత్రి ఉప్మా చేసాను కదా, అది కొద్దిగా వుంటే దాంతో ఇడ్లీ చేసాను..
ఏవిటీ రాత్రి చేసింది ఉప్మానా..అబ్బా ఇంకేదో అనుకున్నా సరేలే  నాకొద్దు కాని, కాఫీనే ఇవ్వమ్మ.
అయ్యో ఏంటండి అలా అంటారు బాగుంది కొంచెం తినండి, కొద్దిగా పెట్టవే తింటారు..
నువ్వు నోరు మూసుకో తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని ఇన్నాళ్ళు నీ పిచ్చి తో చంపావ్, ఇప్పుడైనా కోడలితో కాస్త కమ్మగా వండించుకుందామనుకుంటే ఆ పిల్లకి అంటించావ్ నీ పిచ్చి సరిపోయారు ఇద్దరూ దొందూ దొందే..
అయినా మా అమ్మ వంట ఎంత బాగుండేది..
ఆ మరే చెప్పక్కర్లా ఆ మాడిన గిన్నెలు తోమలేక చచ్చేదాన్ని నేను, మీకేమి తెలుసు. అయినా కాలానికి తగ్గట్టు మనమూ మారాలి కొత్త వంటలు రుచి చూడద్దా ఏంటి..??
అయితే మీరు వండుకొని మీరే మింగండి మమ్మల్ని చంపొద్దు. సాయంత్రం మా కోసం కాస్త చారు నీళ్ళు పెట్టి, బంగాళాదుంప కూర తగలేయండి మాకు చాలు. నేను ఆఫీసుకి వెళ్తున్నా.
అలాగే… హమ్మయ్య ఇంక మనం  సినిమా చూద్దాం రావే కుమారి.

మార్చి 10, 2008

మధురానుభూతులు…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 5:48 పూర్వాహ్నం

అమ్మ చేతి ముద్ద …

నాన్న చేయి పట్టుకొని బజారు వెళ్ళిన రోజు …

మొదటి సారి బడిలో దింపి వెళ్ళగానే, ఎవరికి తెలియకుండా వెనాక్కి వచ్చి ఇంటి బయట అరుగు పక్కన దాక్కున్న రోజు ….

గురువు గారి చేతి దెబ్బలు తిన్న రోజులు ….

తాతయ్యలు, నాయనమ్మ, అమ్మమ్మ చెప్పిన కధలు …

స్నేహితులతో కలిసి తిరిగిన రోజులు…

అత్తయ్య కుట్టించిన డ్రెస్సులు …

మామయ్యలు తెచ్చిన మిఠాయిలు …

తోబుట్టువులతో ఆడిన ఆటలు, తగిలిన దెబ్బలు…

.

.

.

.

.

.

.

.

.

  • బ్లాగు క్రియేట్ చేసిన రోజు …

అమ్మో అమ్మో చాలా రాసేసాను ఇంక ఇవ్వాల్టికి చాలు

హమ్మయ్య ….

మార్చి 7, 2008

జోక్ …

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:02 పూర్వాహ్నం

ఒక అడవిలో ఒక ఏనుగు ఒక చీమ మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి …

చీమ: నీ వయసెంత ….?

 ఏనుగు: నా వయస్సు నాలుగు సంవత్సరాలు …

 చీమ: ఇంత పెద్దగా వున్నావ్ నీ వయస్సు నాలుగు సంవత్సరాలేనా ….???

ఏనుగు: నేను కాంప్లాన్ తాగుతాను ‘ ’i'm  ఎ కాంప్లాన్ బోయి….’

ఏనుగు: నీ వయసెంత ……..?

చీమ : నా వయస్సు పది సంవత్సరాలు …

ఏనుగు : ఇంత చిన్నాగా వున్నావు నీ వయస్సు పది సంవత్సరాలా …!

చీమ : నేను సంతూర్ వాడతాను ‘i’m ఎ  సంతూర్ గర్ల్ ‘

మార్చి 6, 2008

ష్పెషల్ ఇంటర్వ్య్ విత్ పిడతల రాధ …

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 3:26 అపరాహ్నం

ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. మీరంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న “పనిలేని పరిచయం” కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని  వుందా….??? ఆవిడ ఎవరో కాదండి అతి తక్కువ సమయంలో అన్ని వయస్సుల వారిని ఆకట్టుకున్న వర్ధమాన కధానాయకి, ’పక్షిగొపి ఫేమ్’ దన్నుశ్రీ గారు. ’ఉడతల రాధ నా పిడతల రాధ’ అనే పాటతో తనకి ఎంతో పేరు వచ్చినందువలన, ఆ పాటలోని ’పిడత రాధ’ గా  మీముందుకు వస్తున్నారు.
 
యాంకర్: హెల్లో మేడం హౌ ఆర్ యు…?
పి.రాధ  : హాయ్ …..ఐమ్ ఫైన్…. థెంక్యు  (హి హి హి)
యాంకర్: మీ సినిమా ’పక్షిగొపి’ సినిమా సక్సెస్ కి మా ఛానెల్ తరుఫునా మా ప్రేక్షకుల తరుఫున మీకు             మా కంగ్రాట్స్ మేడం
పి.రాధ  : థెంక్యు 
యాంకర్: ఆఫ్టర్ సీయింగ్ యువర్ మూవి సోమెని ఫాన్స్ వాన్ట్ టూ టాక్ విత్ యూ మేడం. క్యాన్ వి టేక్ ద              కాల్స్
పి.రాధ  : యా యా ష్య్ (sure కి వచ్చిన తిప్పలు)
యాంకర్: మొదటి అద్రుష్టవంతులు ఎవరో చూద్దామండి…..
           హలో  వెల్ కం టూ ’పనిలేని పరిచయం’ మీపేరు చెప్పండి, ఎక్కడినుండి కాల్ చేస్తున్నారండి..?
మొ.అ : హలో మేడం, నా పేరు చింతకాయల పుల్లయండి. ఇశా పట్నమండి మాది.
యాంకర్: చింతకాయల గారండి స్వాగతం, ఏం చేస్తూంటారండి మీరు…?
మొ.అ :  మేడం నేను చింతకాయల యాపరవండి.                                                      యాంకర్: ఓకే నండి మన షోకి ఈరోజు పిడతల రాధ గారు వచ్చారండి మాట్లాడండి.
మొ.అ :  ఆ ఇవ్వండి, మేడం నమస్కారమండి, బాగున్నారా..?
పి.రాధ  : హాయ్ నేన్ బగున్నను, హావ్యు  సీన్ ద మూవి.
మొ.అ : అయ్ బాబోయ్ మీరు ఏటో ఇంగ్లీస్ లో మాటాడుతున్నారు నాకేమీ అర్ధం కాలేదు. కాని మీ సిన్మా            చానా బావుంది.
యాంకర్: పుల్లయ గారు మేడం అదే అడుగుతున్నారు.
మొ.అ : ఆ చానా నచ్చినాదండి, మా బుడ్డోల్లకి కూడ  చానా నచ్చినాదండి. ఇప్పటికే రెండు సార్లు            చూసామండి. మళ్ళీ సూద్దామని మా ఇంటిది ఒకటే గోలండి.
పి.రాధ  :  పులాయ్ గారు మిఖు ఎ సీన్ బగుంది…?
మొ.అ :  ఆ మేడం మీరు సిన్న సెడ్డి సిన్న గౌను ఏసుకొని సెరువులో ఈత కొట్టారు సూడండి అది సాన             బావుందండి. ఆ సీన్ ఏత్తారా మేడం ఇప్పుడు సూట్టానికి.
యాంకర్: పుల్లయ గారు తప్పకుండ మీకోసం ఆ సీను వేస్తామండి (అలా అంటారు కాని వెయ్యరు)
           ఓకె పుల్లయ గారు ఇంక ఏమైనా అడగాలనుకుంటున్నారా మన రాధ గారిని
మొ.అ : పిడత గారు మీకు పెళ్ళైందాండి…?
పి.రాధ  : ఒహ్ నో ఆక్చ్యుల్లీ ఐ డింట్ ఫైండ్ ఎనీ వన్ హు కన్ అండస్టాండ్ మీ..
యాంకర్:  పుల్లయ గారు మేడం ఇప్పుడప్పుడే పెళ్ళీ చేసుకోరట, మీరు ఇంకేమైనా అడుగుతారా..
మొ.అ : వద్దులేమ్మ ఇప్పటికే నాకు బిల్లు వాచింది (నువ్వు ఇత్తావా లేక నీ పిడత ఇత్తదా)
యాంకర్: కాల్ చేసినందుకు థాంక్స్ పుల్లయ గారు, బై…
           ఇప్పుడు ఒక సీన్
          తరువాత
యాంకర్: మేడం మీకు ఎంతో పేరు తెచ్చిన ’పక్షిగొపి’ సినిమా షూటింగ్ లో మీ అనుభవాలు గురించి మా             ప్రేక్షకులకి వివరిస్తారా…
పి.రాధ  : యా ష్యు  ఐ వుడ్ లైక్ టు సే ఎబౌట్ ఎ సీన్. ఇన్ దట్ ఐహవ్ ఫేస్డ్ కామ్ రా ఫర్ ద ఫస్ట్ టైమ్.
            ఐ వస్ స్కేర్డ్ వెరి మచ్చ్ యూ నో… 
 
యాంకర్: ఓకే రాధ గారు మనం నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో ఎవరండి చెప్పండి
రె.అ  :  హలో  నేను కూకుట్లపల్లె నుంచి మూకుళ్ల కూర్మయ్య
యాంకర్: హలో ఏంటండి
రె.అ  :  హలో  నేను కూకుట్లపల్లె నుంచి మూకుళ్ల కూర్మయ్య
యాంకర్: ఏంటండి కూర్మం గారా… ఏవూరండి…
రె.అ  :  అమ్మా నేను కూకుట్లపల్లె నుంచి మూకుళ్ల  కూర్మయ్యమ్మ కూర్మయ్య
యాంకర్: ఆ ఓకే ఓకే (వినపడిందో లేదో) మీ టీవీ వాల్యుమ్ తగ్గించాలండి
రె.అ  :  రాధ గారితో మాట్లాడొచ్చాండి
యాంకర్: తప్పకుండా మాట్లాడండి
రె.అ  :  కుంయి  కుంయి  కుంయి కుంయి
యాంకర్:  అయ్యో ఫోను కట్ అయినట్లుందండి, ఏం పర్వాలేదండి.
           మీరు పిడత గారితో మాట్లాడాలనుకుంటే వెంటనే ఈ నంబర్ కి  కాల్ చెయ్యండి ——–.
         ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకోని తొందరగా వచేస్తామండి. మీరు ఫోన్ చేస్తూనే వుండండి.
       
[పక్షిగొపి  సినిమాలో దన్నుశ్రీ పాత్ర పేరు ...? (1) పిడతల రాధ (2)  సొనాలి]
కరెక్ట్ ఆన్సర్ sms చేయండి ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి మీరు గెలవచ్చు రెండు గుండుసూదులు.
కాసేపు adds అయిపోయాకా తిరిగి పనిలేని పరిచయం….

యాంకర్: వెల్కం బ్యాక్ టూ అవర్ శివరాత్రి స్పెషల్ షో పనిలేని పరిచయం. ఇక్కడ వున్నారు మన             పిడతల రాధ గారు, తరువాత కాల్ చూద్దం. హలో ఎవరండి..? హలో హలో చెప్పండి
మూ.అ:  హెలో పుల్లేటికుర్రు నుండి గోపిని మాట్లాడుతున్నానండి
యాంకర్: గోపి గారు ఏం చేస్తుంటారండి మీరు…
మూ.అ:  నేను ఇంటర్ ఫైనల్ ఇయర్ అక్క, —— చాలా సంతోషంగా వుందక్క నాకు, ఫష్ట్ టైం నాకు             కాల్ కలిసింది. ఏం మాట్లాడాలో తెలియట్లేదక్క. చాలా సేపటి నుండి ట్రై చేస్తున్ననక్క ,             రాధగారితో మాట్లాడొచ్చాక్క.
యాంకర్: (మొహం మాడి నా కూడా నవ్వుతూనే) రాధ గారి తో మాట్లాడు గోపి
మూ.అ: హెల్లో మేడం మీ మూవి చాలా బాగుంది, ఇంకా కొత్త మూవిస్ ఏమి చేస్తున్నారు
పి.రాధ  : యా థేంక్యు గోపి, ఐమ్ డూఇంగ్ మై నెక్స్ట్ మూవి విత్ ’బాజా సుభాష్’ మూవి నేమ్ ఈజ్ ఈజ్
           “మటి లెని అట స్రుటి లెని పట”
మూ.అ:  ఏంటండీ…….
యాంకర్: మేడం తన నెక్ష్ట్ మూవి పేరు “మతి లేని ఆట శ్రుతి లేని పాట” అని చెప్పారు.
 పి.రాధ: య య యువర్ రైట్ (హి హి హి)
మూ.అ:  అందులో మీ కారక్టర్ ఏంటండి…?
పి.రాధ:  యా ఇన్ దట్ ఐమ్ ప్లేయింగ్ అ వెరైటీ కారక్టో. ఇట్స్ అ మెసెజ్ ఓరియంటడ్ మూవి.
యాంకర్: గోపి ఆ మూవి ఉగాదికి రిలీజు అవుతుంది తప్పకుండా చూడండి.
మూ.అ:  తప్పకుండా చూస్తామండీ, రాధగారి యాక్షన్ అంటే మాకు చాలా ఇష్టమండి. మాకోసం ఒక పాట            పాడుతారా రాధగారు
పి.రాధ: ఓ నో 
మూ.అ: ప్లీస్ ఒకసారి పాడండి
పి.రాధ: కె
             పక్సిగోపి న ముస్తి గొపి   ధన్ ధనా ధన్…….
            వుడ్ తుల్ రద న పిడ్ తుల్ రద
           ఎనఫ్ ఎనఫ్  హి హి హి
యాంకర్: గోపి చాలా ఆనందంగా వుంది నీవల్ల మేమందరం కూడా పిడత గారి పాట విన్నాము. గోపి బై.

ఇప్పుడు ఏదో ఒక పాటో లేక సీనో వాళ్ళ దయ…….వాయించి వదిలిపెట్టారు.
యాంకర్: ఇప్పూడు లాష్ట్ కాల్ తీసుకుందాం హలో వెల్ కం టూ ’పనిలేని పరిచయం’
నా.అ:   హలో పిడతల రాధ గారు బాగున్నారా…?
పి.రాధ: యా మీ పెరూ చెపండి
నా.అ:  నాపేరు మల్లేష్, మీ మూవి మస్తుగుందని మా దోస్తులు చెప్పిర్రు. టిక్కేట్ల కోసమ్ మా బావ           వోయిండు. ఏమైన జేషి ఈరోజు సిన్మాకు పోతం.
పి.రాధ: కె, మల్లేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంద్రూ చుడు. కాల్ మి అగైన్ వెన్ ఐ కమ్ హియ.(ర్)
నా.అ:  ఏంది, ఫ్యామిలి చూష్ టట్టూన్నాదాసీన్మా. పది రోజులసంది గా పాటలేస్తుర్రు, ఒక్క ముక్క           అర్ధమైతాందా…?? గా డ్రెస్స్ లేందమ్మా నీ తాన లేకుంటె జర చెప్పు మేము పం ….
          కుంయి  కుంయి  కుంయి  కుంయి
యాంకర్: పాపం మల్లేష్ అమ్మగారు అనుకుంటా ఏదో చెప్పబోయారు లైన్ కట్ అయింది.
          ఓకె రాధ గారు మీ అమూల్యమైన సమాయాన్ని మా షో కోసం కేటాయించినందుకు చాలా థాంక్స్
పి.రాధ: థెంక్యు, రియల్లి ఐఎంజాయిడ్ ది షో
యాంకర్: పక్షిగొపి లాగనే మీ అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మాప్రేక్షకుల తరుపున మా ఛానల్            తరుఫున మీకు బెష్ట్ విషెస్ 
పి.రాధ: థెంక్యు, అంద్రు న మూవి హిట్ చెయలి ప్లీస్
          అంద్రికి నమస్కరమ్
యాంకర్: నమస్కారం….       

మార్చి 4, 2008

movies…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:28 పూర్వాహ్నం

   Frns,
It’s  Movie time, lot of New Movies are goinna release..
        Look at the list below..

.

.

.

.

.

.

.

.

.

.

.

.


.

.

.

.

.

.

.

.

.

.

.


Chiranjeevi Son     :  Chirutha

 
 
BalaKrishna Son       :    Budatha

 

Venkatesh   Son    :  Vudatha

 

MohanBabu Son   :    Midatha

 

Nagarjuna son      :   Nattha

అమ్మో పండగ…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 9:23 పూర్వాహ్నం

మహా శివరాత్రి సందర్భంగా మీ అభిమాన TV channel లో ప్రసారకార్యక్రమాలు………


ఉదయం 6 గంటలకి శివస్తుతి…లింగాష్టకం, భూలోక కైలాసం అయినటువంటి శ్రీ కాళహస్తీ గురించి ప్రముఖుల చర్చా గోష్టి.
కోటప్పకొండ తిరణాళ్ళ ప్రత్యక్షప్రసారం. (కిందటి సంవత్సరంది)

7 గంటలకి వార్తలు.

 స్పెషల్ మా కోసం, మా ఫొటోలు చూపిస్తూ మాకు నచ్చిన కార్యక్రమాలు మీ కోసం చూపిస్తాం.(ఈ సోది ఎంతసేపో)

బ్లాక్ బస్టర్ మూవి “దిక్కుమాలిన కుక్క”

పక్కింటి వంటలో “నిరీక్షిత్”(పక్షి గోపి ఫేం) గారు చేసి చూపించే రుచులు.
 
మీ అభిమాన డైలీ సీరియల్ “జిడ్డు రాగం”పండగ స్పెషల్(దీనికి అంతం వుందా…?)

(పక్షి గోపి ఫేం) “దన్నుశ్రీ” గారితో మీరు మాట్లాడే అవకాశం. మీరు ఫోను చేయల్సిన నంబరు 040-420420

మీ అభిమాన డైలీ సీరియల్స్ నుండి మీకు నచ్చిన సన్నివేశాలు (ఇప్పుడు మాత్రం మీ ఫొటోలు చూపిస్తాం)

“ఆట మాదే పాట మాదే”మీ అభిమాన యాంకర్లు చేసే విన్నూత్న కార్యక్రమం “కొట్టుకు చద్దాం రండి”

ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న డైలీ సీరియల్ “ఆగదు సాగదు” 3000 స్పెషల్ ఎపిసోడ్ మీకోసం

బ్లాక్ బస్టర్ మూవి “బాండ్ బాబా” (సస్పెన్స్ థ్రిల్లర్)

దోసకాయల పుల్లమ్మ గారిచే “తంబోలా”. మీరు ఎన్ రోలు చేసుకోవలసిన నంబరు 040-210210 కి ఫోను చేసి “తంబోల” అని గట్టిగా చెప్పండి. (మాకు ఇక్కడకు వినపడేట్టు) ఎన్నో బహుమతులు కొట్టేయండి. 3 అప్పడాల కర్రలు, 5 చీపుళ్ళు, ఇటువంటి ఎన్నో కళ్ళు చెదిరే బహుమతులు మీకోసం. ఇంకెందుకు ఆలస్యం మీ మీ సెల్ ఫోన్స్ తీయండి నంబర్ డైల్ చేయండి మీ నంబర్ ఎన్ రోలు చేసుకోండి.

ఫోను మీది-సొల్లు మాది, నూతన సినీగీతాల కార్యక్రమం.

“భూకైలాస్” భక్తిరస చిత్రం మీకోసం (మన కోసం ఆ సినిమా పెట్టీ వాళ్ళు పడుకుంటారేమో)

శివసంకీర్తన (తెల్లారిందాకా)

ఇవేకాక మీ అభిమాన డైలీ సీరియల్స్ & adds మీకోసం
ఈ కార్యక్రమాల మద్యలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు sms చెయ్యండి. ప్రతి ప్రశ్నకు 5 విమానాలు, 10 రాకెట్లు, 20 జెట్లు, వీటితో పాటు ఎన్నో గుండు సూదులు మీరు పొందచ్చు ఒక్క sms తో.

పండగ అంటే ఇదేనా…………???

మార్చి 1, 2008

మంచి భోజనం వడ్డించిన రోజు…

ప్రచురించిన వర్గము Uncategorized — pavani5 @ 11:00 పూర్వాహ్నం

ఇక మన “పక్షిగొపి” సినిమా రిలీజు రోజు చూడాలి హడావిడి. ఆ రోజు news paper, tv, లో మన సినిమా గురించే గోల. మన సినిమా చిన్నదేం కాదండోయి ఒకేసారి ఒకే area లో మొత్తం ౩౦ theaters లో రిలీజు అయ్యింది. ముందురోజు నుండి అభిమానుల అనందానికి అవధులు లేవు. theater ముందు మన హీరో పక్షి గారి కటౌట్స్, మన అండమాన్ సుందరి కటౌట్స్, వాటికి  పెద్ద పెద్ద దండలు, మన అభిమాననికి అవధులు లేవు కదండి ఆ దండలు ఏవయినా కావచ్చు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వేస్తూవుంటారు.
పెద్ద పెద్ద banars మన అభిమానుల పేర్లతో దర్శనమిస్తాయి.
chairman: కూనిష్టి రావు
member : అభిమాన సంఘ సభ్యులు……………………………………….

మన సినిమా కి ఒకే ఒక చిన్న లోటండి అది, మన సినిమా కి ప్రిమియర్ షొ లేదు దానికి కి కారణం వుందండోయి….
ఒక రోజు director గారు ప్రివ్యూ కి ముహూర్తం పెట్టారు. ఇక సినిమా లోకంలోని సగం మంది హాజరయ్యారు. పాపం మన మీడియా ప్రతినిధులు ఏంచేయ్యలేక, కళ్ళకి నల్ల కళ్ళజోళ్ళు , చెవులలో దూది పెట్టుకొని, మనసులొ తిట్టుకుంటు, పైకి నవ్వుతూ లోపలకి అడుగు పెట్టారు భయం భయంగా. ఇక సినిమా start అయ్యిందోచ్.
డడ్డడక డడ్డణక  డడ్డడక డడ్డణక డడ్డడక డడ్డణక ……. ( పేర్లు)
ధడక్ ధడక్ ధం ధం ధనాధన్ ధడక్ ధడక్ ధం ధం ధనాధన్ ( ఫైట్)
ఈ ఫైట్ లోనే పక్షి గారిని అండమాన్ సుందరి చూసి మనసు పారేసుకుంటుంది next మనకు తెలిసిందే….
మూడు ముద్దులు ఆరు కౌగిలింతలతో కింద మీద పడుతూ పాట..
నా దిమ్మ తిరిగేను నిన్ను చూసి…(పక్షి)
నీ దిమ్మ తిరగ నా బుర్ర తిరగె… (అ.సు)
……………….
హాలంతా నవ్వారు కమెడియన్ వేసిన రెండు కుళ్ళు జోకులకి..
ఇప్పుడు అందరు ఎదురు చూసే BREAK వచ్చేసింది. lights on అయ్యాక చూస్తే వచ్చినవాళ్ళలో సగం మందే వున్నారు.
దీని పర్యవసానమే ప్రిమియర్ షొ లేకపోవడానికి కారణం.
ఇంక తిక్కట్ల కోసం అభిమానులు లైన్లు చూడాలి………………………………………………………………………………………………………………………………………………………………………………..(క్యు)
తొక్కిసలాటలో మనుషులు పోతున్నా పట్టించుకోని మైకంలో మొత్తానికి తిక్కట్లు సాధిస్తారు, ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ….
తిక్కట్ల కోసం లైన్లో నుంచున్నంత సేపు పట్టలా సినిమా చూడడమ్. ౩ గంటలు ఇట్టె అయిపోతుంది, బయటికి రాగానే, ఆత్రుతగ ఎదురు చూస్తున్న  tv channel వాళ్ళు  దర్శనమిస్తారు. మన అభిమానులకి అవేశం ఆగుతుందా…..? మైకు లాగేసుకొని మరి చెప్పసాగారు
… చాలా బాగుంది మూవి 100 days పక్కా
… ఈరో బాగ చేషిండు, ఈరోఇన్ భీ మంచిగ చేసింది.
… మల్ల మల్ల సూస్తా
… పక్క నంది అవాడ్ అస్తది
… బిడ్డ సీన్మా బాగొట్టింది( ఏం కొట్టిందో మరి)
… చాలా బాగుందండి చాలా మంచి స్క్ర్రిప్ట్
… అచ్చా లగా మూవి( ఏం అర్ధమయిందో మరి)
… హీరో ఫైట్స్ సూపర్
… 200 days no doubt……
ఇది మన సినిమా రిలీజు రోజు చేసిన హడావిడి …

WordPress.com లో Blog పెట్టుము.