“స్నేహం ” ఆమాటగురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా తరగని మాధుర్యం స్నేహంలో ఉంది. అది మాటలకందని గొప్ప అనుభూతి. స్నేహం అనేది ఒక గ్రీటింగ్ కార్డ్ తోనో, లేక ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తోనో, ఏబహుమతి తోనో ఏర్పడేది కాదు, వాటివల్లనిలిచేది కాదు. కులం- మతం భాష – దేశం ఆడ -మగ చిన్నా-పెద్దా తేడా లేనిది, ఏద్వేషం లేనిది స్నేహం ఒక్కటే. ఏస్వార్ధం లేని అతీతమైన బంధం స్నేహం కాని కొంతమంది దానిని స్వార్ధానికి వాడుకుంటున్నారు ఈరోజుల్లో. డబ్బుతోముడిపెట్టి నిజమైన స్నేహితులని కష్టాలలోకి నెడుతున్నారు. ఇటువంటి పరిస్తితులలో మంచి స్నేహితులను పొందటం నిజంగా అదృష్టం, కాని కొంతమంది సినిమాలు షికార్లు మాత్రమే స్నేహమని అనుకొంటారు. మనసు లోతుల్లోని భావాలు ఎంతమంది చూడగలరు..?ఆడుకున్నా కొట్టుకొన్నాతిట్టుకొన్నా , బళ్ళో కలిసి పనిష్మెంట్ తీసుకున్నా, కాపీలు కొట్టినా, స్కూల్ బయట ఒక కాయ కొని రెండు కాయలు కొట్టేసినా, పానీపూరీ తిన్నా, రన్నింగ్ బస్ ఎక్కినా, పాటలు వింటూ డాన్స్ చేసినా ,బీటు కొట్టినా,చిన్న పాటి తగదాల తో విడిపోయి మళ్ళీ కలిసినా అది స్నేహితులకే చెల్లుతుంది. అలాంటి స్నేహంలో వున్నగొప్పదనం ఎంతమంది ఆస్వాదిస్తున్నారు.? ఏ కష్టమొచ్చినా స్నేహితుడు అందించే హస్తం ఎంత ధైర్యాన్నిస్తుంది, జీవితంలో ముందుకు సాగటానికి ఆధైర్యంఎంతో చేయూతనిస్తుంది. ఇవ్వాళ్ళ స్నేహితులిగా వున్నవాళ్ళు రేపు ద్వేషంతొ కొట్టుకొంటున్నారు చంపుకొంటున్నారు…… వద్దు, ఇటువంటి స్నేహం వల్ల మనస్తాపాలే కాని మానసోల్లాసం లేదు. కొందరు ప్రేమ కోసం స్నేహాన్ని అడ్డం పెట్టుకుంటారు ఇది ఎంత వరకూ సమంజసం? పారదర్సకమైన స్నేహాన్ని మలినం చేయద్దు , స్వచ్చమైన స్నేహాన్ని ఆహ్వానిద్దాం.
అందరికి స్నేహితుల రోజు శుభాకాంక్షలు…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 2, 2008 @ 6:33 అపరాహ్నం
మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Naga Muralidhar Namala — ఆగష్టు 2, 2008 @ 8:37 అపరాహ్నం
స్నేహం తన ఔన్నత్యత కోల్పోయి పలు రకాల అవసరాలకు ముసుగుగా పనిచేస్తున్న మాట అక్షరాలా సత్యం. స్నేహం చేసే వ్యక్తికే దాని లోతు తెలియనంత కాజువల్ రిలేషన్స్ సంస్కృతి నడుస్తున్న తరుణంలో స్వచ్ఛమైన, స్వార్థరహితమైన స్నేహాన్ని ఆశించడం అత్యాశేనేమో! కొండొకచో ఎలాంటి మనోవికారాలూ లేని కల్మషరహితమైన స్నేహితులు దొరికారంటే అది మన పూర్వజన్మ సుకృతమేననుకోవాలి. స్నేహం వర్థిల్లాల్లి.. ఇలా ప్రేమకు, కామానికీ, ఆర్థిక సామాజిక స్వార్థాలకు ముసుగుగా కాదు.. స్వచ్ఛంగా, అత్యుత్తమమైన మానసిక బంధంగా మానవసంబంధాలను పటిష్టం చేయాలి..! లేదంటే ఏ నిముషంలో తెగిపోతాయో తెలియని సంబంధాలతోనే అందరూ వేదన పడక తప్పదు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నల్లమోతు శ్రీధర్ — ఆగష్టు 3, 2008 @ 4:16 పూర్వాహ్నం
hmmm…ur right..
happy friendship day swetha..
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా జ్యోతి — ఆగష్టు 3, 2008 @ 6:53 పూర్వాహ్నం
పావని గారూ స్నేహం గురించి చాలా బాగా చెప్పారు.ప్రస్తుతం స్నేహాలు ఎవరి మద్య ఎక్కువుగా ఉన్నాయంటే, ధనవంతుడికి-ధనవంతుడుకి, పేదవాడికి-పేదవాడికి, ఒకే కులం వారి మద్య, ఒకే వయసు వారి మద్య, ఒకే పార్టీ వారి మద్య, ఎక్కువుగా ఉంటున్నాయి. ofcourse యువతి-యువకుల మద్య మామూలే అనుకోండి. ఈ వ్యత్యాసాలు పోవాలి..
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా krishna rao jallipalli — ఆగష్టు 3, 2008 @ 6:12 అపరాహ్నం
chaala baagundi. friendship py chinna chinna kavithalu kuda andinchandi. mee kavitha kosam rojoo eduru choostanu
meeku kuda friendship day shubhakanshalu.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chaala baagundi. friendship py chinna chinna kavithalu kuda andinchandi — ఆగష్టు 1, 2009 @ 12:21 అపరాహ్నం