నాఆత్మకధ మీతో చెప్పాలని ఈరోజు ఎందుకో అనిపిస్తోంది. ఈమద్య స్లిమ్ గా ఫెయిర్ గా అవ్వాలనుకొని కొన్ని సౌందర్య సాధనాలు వాడాను వాటి ఫలితాలను మీకు చెప్పుకుంటాను.
టీవీలో ’అందం’ సీరియల్ చూస్తుంటే…… మద్యలో బ్రేక్ లో వచ్చిన యాడ్స్ లో కోల్గేట్ యాడ్ చూసాను. డాక్టర్లందరు దంత సౌందర్యం కోసం కోల్గేట్ వాడమని సూచిస్తున్నారు. అది చూసి దీంతో అయినా నాపళ్ళు బాగుపడతాయని ఆశతో వెంటనే వెళ్ళి కోల్గేట్ పేస్ట్ తెచ్చాను. ఇక నాపళ్ళు మిలమిలలాడతాయని ఎంతో ఆనందంతో ట్యూబ్ ఓపెన్ చేసాను. తీరాచూస్తే అది నాఒక్క పంటికి కూడా సరిపోలేదు. ఈరకంగా ఎన్ని పేస్టులు తెస్తే నాపళ్ళు బాగుపడతాయని నిరాశతో ఆప్రయత్నం మానుకొన్నా. దంత సౌందర్యం ఆరకంగా సమాధి అయ్యింది.
కనీసం చర్మసౌందర్యం అయినా మెరుగు పరుచుకొందామని అదేదో ఫెయిర్ అండ్ లవ్లీ అని విన్నాను, సరే దీని సంగతి ఏమిటో చూద్దామని, పేస్ట్ ఒకటి తెస్తే చాల్లేదని, ఇవి నాలుగు తెచ్చాను కాని అన్ని కలిపినా ముఖానికి ఒక పక్కకి కూడా రాలేదు. ఈరకంగా చర్మసౌందర్యం కూడ మట్టిలో కలిసి పోయింది. ఎహె…. ఎందుకొచ్చిన గోల అని కొన్ని రోజులు మూసుకొని వూరుకొన్నా. నేను వూరుకొందామన్నా యాడ్స్ వూరుకోనిస్తాయా…?? ఈమద్యనే చూసా మన మాస్ట్రర్ బ్లాస్టర్ చెప్పిన సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి. అందులోను ఈమద్య కాస్త నీరసంగా ఉంటోందేమో, దాంతో చెంగున ఎగురుకుంటు వెళ్ళి ఒక కిలో బూస్ట్ తీసుకువచ్చాను. కానీ దాన్ని పాలల్లొ కలపటానికి యజమాని కాసిని కూడా పాలు మిగల్చడు. దాంతో ఏదారిలేక కుడితిలో కలుపుకొని తాగాను ఉపయోగం ఏముంది… అలాంటి కిలోలు ఎన్ని తెస్తె నాకు సరిపోతాయి…? మనకి గడ్డే మేలు అనుకొని గడ్డిలో లేనిది దానిలో మాత్రం ఏముంటుందిలే అని దాన్ని కూడ తృణ ప్రాయంగా వదిలేసాను.
ఆ ఇంకో విషయం మర్చిపోయాను, ఆమధ్య సంతూర్ సబ్బు కూడ తెచ్చాను. అది వాడితే చాలా చిన్నగా కనపడతామని అంటే. కాని దాన్ని ఈచర్మానికి ఎలా రుద్దాలో అర్ధంకాక, సరే నీళ్ళలో కలుపుకొని స్నానం చేద్దామనుకొన్నా. కాని చెరువులో ఎన్నిసబ్బులు కలిపితే మన స్నానానికి సరిపోతుంది. ప్చ్…. హ… ఏమిటో ఈజీవితం, విరక్తి పుడుతోంది.
చివరి ఆశగా సోనా బెల్ట్ ఒక్కటివాడి కనీసం పొట్టయినా తగ్గిద్దామని అనుకొన్నాను. ఎందుకంటే మనిషే కాదు బర్రె కూడ ఆశా జీవే కదండి. అయినా ఈసారి నా స్తోమత కూడా అలోచించకుండా పీనాసితనానికి పోకుండా ఓ పదిబెల్ట్ల్ల్ లు కలిపి వేసాను. అయినా కూడా నా ఆకారాన్ని వెక్కిరిస్తూ అది కాస్తా ఫట్ మని తెగింది. ఛి…ఛీ… అనుకొని, మనకి ఇవేవి సరిపడవు లే అని అనుకొని, ఈబర్రె జీవితంలో ఉన్నసుఖం ఎందులోను లేదని, హాయిగా నాగడ్డేదో నేను తింటూ నా నెమరేదో నేనెసుకొంటూ, అందంలో లేదు ఆనందం అనుకొని. ఇక సీరియల్స్ చూసినా యాడ్స్ మాత్రం చూడకూడదు అని నిశ్చయించుకున్నాను.
ఆగష్టు 3, 2008
ఆశా నిరాశేనా…
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
“ఇక సీరియల్స్ చూసినా యాడ్స్ మాత్రం చూడకూడదు అని నిశ్చయించుకున్నాను.” ఇక సీరియల్స్ చూసినా… వామ్మో… ఇక మనకి పాలు ఎక్కడనుంచి వస్తాయి.. వొద్దు వొద్దు.. యాడ్స్ ని చూడనివ్వండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా krishna rao jallipalli — ఆగష్టు 3, 2008 @ 6:27 అపరాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 3, 2008 @ 6:36 అపరాహ్నం
అయ్యో ఫారిన్ సోప్ వాడాల్సింది బర్రె గారు. మన కత్రినా రంగు లోకి వచ్చేస్తారు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Naga Muralidhar Namala — ఆగష్టు 3, 2008 @ 7:43 అపరాహ్నం
వారెవ్వా! సూపరు!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా name — ఆగష్టు 3, 2008 @ 9:20 అపరాహ్నం
“మనిషే కాదు బర్రె కూడ ఆశా జీవే ” నిజమే! బాగుంది ట్విస్టు. ఇలాగే కానించెయ్యండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — ఆగష్టు 4, 2008 @ 3:12 పూర్వాహ్నం
Too good…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Srividya — ఆగష్టు 4, 2008 @ 6:25 పూర్వాహ్నం
వెరీ గుడ్డూ ! అయితే, మీరు ‘యూ ఆర్ వర్త్ ఇట్’ వేవీ వాడలేదా ? ఈ ఏడ్ లే భలే ఉంటాయి కదూ !
అన్నిటికన్నా షేంపూల ఏడ్ లు అదురుతాయి. నేనూ సృష్టి లో (భారతీయ విపణిలో) అన్ని షాంపూలూ వాడేసి, ఇప్పుడు కొత్తిమీర కట్ట అయిపోయాను. మీలాగే, బుద్ధి తెచ్చుకుని మెహందీ – షీకాయా – గడ్డీ – నెమరూ కి సెటిల్ అయ్యా!
మన బలహీనతలకు ఇవి ఒక సవాల్ !
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sujata — ఆగష్టు 4, 2008 @ 9:58 పూర్వాహ్నం
హ హ హ
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — ఆగష్టు 4, 2008 @ 10:34 పూర్వాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రతాప్ — ఆగష్టు 4, 2008 @ 12:19 అపరాహ్నం
Hehehe.. too good!!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — ఆగష్టు 4, 2008 @ 1:39 అపరాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నిషిగంధ — ఆగష్టు 5, 2008 @ 12:49 అపరాహ్నం