మన సినిమాలలో కొన్ని సీన్లు చూస్తే భలే నవ్వు వస్తుంది, కాస్త విచిత్రంగా కూడ ఉంటుంది. హీరో కధాపరంగా బీదవాడు అయినా స్ర్కీన్ మీద మాత్రం బైక్ లేకుండా అడుగుబైట పెట్టడు. హీరోయిన్ బర్త్ డే వచ్చిందంటే నెక్లెస్ కాని కనీసం ఒంటిపేట బంగారు గొలుసు కాని ప్రెజెంట్ చేస్తాడు. అయ్యగారికి ఉద్యోగం సద్యోగం ఏది లేకపోయినా, అంత డబ్బు ఎలా వస్తుందో తెలీదు. పోని ఇంట్లో వాళ్ళు ఇస్తారా అంటే, ఇల్లు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కనపడరు. కనీసం వాళ్ళ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడు. ఎక్కడ తింటాడో ఎక్కడ పడుకొంటాడో తెలియదు.
ఒక సీన్లో వేసిన బట్టలు ఇంకో సీన్లో వెయ్యడు, ఆబట్టలు అన్నీఎక్కడ పెడతాడో తెలియదు. మనకైతే అన్ని బట్టలు పెట్టుకోవాలంటే కనీసం నాలుగు బీరువాలు కావాలి. అమ్మ అయ్య లేకపోయినా దేవుడిచ్చిన చెల్లొ తమ్ముడో ఉంటారు. వాళ్ళకోసం ఈయనగారు ప్రాణం ఇస్తారు. ఏ అమ్మాయైనా కనపడితే…. అది ఎంత అందంగాఉన్నా సరే హీరోయిన్ కాక పోతే అమ్మా చెల్లెమ్మా అంటాడు. ఎంతవికారంగా ఉన్నా హీరోయిన్ తో మాత్రం అయి లవ్ యు అంటాడు.
సార్ కి వారంరోజులనించి తిండి లేకపోయినా భలే హెల్దీగా ఉంటాడు. అదే మనమైతేనా ఒక్కరోజు ఉపవాసం ఉంటే తెల్లారేసరికి ఈసురో వాసుదేవా అంటూ వేళ్ళాడ బడి పోతాం. ఎక్కడా స్కూల్లో కాలేజీ లో కాని చదివినట్టు కనపడదు కాని అవసరాన్నిపట్టి అయ్యగారు ఇంగ్లీష్ గడ్డగడ్డ గడా మాట్లాడతాడు. మనం వుసూరుమంటూ చిన్నప్పటి నించి డిగ్రీ దాకా చదివినా ఆఇంగ్లీష్ రాదు. ఇక దొరగారి పక్కన స్నేహితుడు ఒకడుంటాడు వాడికి ఎక్క్డడాలేని నిజాయతి, హీరోకి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనగారు విలవిల లాడి పోతాడు. తనసుఖం తను చూసుకోకుండా హీరో కోసమే త్యాగం చేసే ధన్యజీవి.
ఇద్దరూ కలిసి సిగరెట్లు కాలుస్తూ రోడ్డుమీద వెళ్ళేవాళ్ళని కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూంటారు. ఎవరికి ఏమైనాపట్టించుకోరు కానీ అదే హీరోయిన్ పేరెంట్స్ కి మాత్రం ఏచిన్న కష్టం వచ్చినా తెగబాధ పడి పోయి అందులో ఇన్ వాల్వ్ అయిపోయి వాళ్ళకి న్యాయం జరిగె దాకా వదలరు. పాటల విషయానికి వస్తే మన హీరో ఎప్పుడు ఎక్కడ సంగీతం, కవిత్వం నేర్చుకుంటాడో తెలియదు కాని రాగ తాళ యుక్తంగా పాటలు పాడేస్తారు. ఆ పాటలకి తగ్గట్టు డ్యాన్స్ లు.
హీరో ఎంత బక్కపల్చగా, పొట్టిగా వున్నాకూడా, విలన్ ఎంత బండగా వున్నా కూడా హీరో గారు ఒక్కతన్ను తన్నాడంటే విలన్ విల విలలాడుతూ కుప్పకూలిపోవలసిందే. అంత ఫైటింగ్ ఎప్పుడు నేర్చుకుంటాడో అర్ధం కాదు. ఎంత మంది వచ్చినా అలుపు ఆయాసం లేకుండా ఒక్క దెబ్బ తగిలించుకోకుండా అవతలి వాళ్ళని చితకొట్టి చింతకాయ పచ్చడి చేసేస్తాడు. ఎప్పుడైనా ఖర్మకాలి ఏకొండ మీదనుండో పడిపోతే మనమైతే సున్నంలోకి ఎముకలేకుండా అయిపోతాం కాని మన హీరో గారికి మాత్రం నుదిటి మీద చిన్న ప్లస్ మార్క్ వస్తుంది అంతే. ఆ ప్లస్ మార్క్ చూసే హీరోయిన్ ఢమేల్ మని పడిపోతుంది……. షరా మామూలే పాట పక్కనే హిమాలయాలు. మనం ఎంత వ్యయప్రాయసలు పడితేగాని వెళ్ళలేము కాని వాళ్ళు అలా కళ్ళు మూసుకుంటే చాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మంత్రం ఏదో మనకీ తెలిస్తే బాగుండు… ![]()
ఇక మన హీరోయిన్ గారయితే ప్రపంచంలో వున్న కరువుంతా తన దగ్గరే వున్నట్టుగా పాపం చిన్నప్పుడు ఎప్పుడో కుట్టించుకున్న గౌను వేసుకొని తిరుగుతుంది. అందుకేనేమో ఎవరో ఒక గీత రచయిత రాసారు ’ చిన్నగౌను వేసుకున్న పెద్దపాప’ అని ఏదో సినిమాలో. అలాంటి బట్టలు వేసుకొని ఇంట్లొ అందరి ముందు బానే తిరుగుతుంది. కానీ హీరో ముందుకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది. ఆ సిగ్గు ఇంత చిన్న బట్టలు వేసుకోవలసి వచ్చినందుకో లేక ఇవి మాత్రం ఎందుకు వేసుకోవలసి వచ్చిందిరా అనా అర్ధం కాదు. అమ్మాయిగారు మాట్లాడుతుంటే నోట్లో చూయింగం పెట్టుకొని నములుతున్నట్టే వుంటుంది కాని ఒక్క డైలాగ్ కి కూడా లిప్ మూమెంట్స్ కలవవు.
ఏంటో ఈ సినీమాయలు అబ్బో చూడతరమా……
ఆగష్టు 7, 2008
సినీమాయ…
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
అదుర్స్…!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నల్లమోతు శ్రీధర్ — ఆగష్టు 7, 2008 @ 5:46 పూర్వాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శివ — ఆగష్టు 7, 2008 @ 6:49 పూర్వాహ్నం
అందుకే సినిమా ప్రపంచం ఒక మాయాలోకం అన్నారు. అక్కడ నిజాలు,ఇజాలూ,జీవితం అన్నీ సాఫ్ట్ ఫోకస్ లెంసులో, రంగురంగుల్లోనే కనబడతాయి. బీదవాడుకూడా డిజైనర్ బొచ్చెలోనే అడుక్కుంటాడు. కాబట్టి హీరో ఇలా ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు కదా?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — ఆగష్టు 7, 2008 @ 7:16 పూర్వాహ్నం
హ..హా బాగా చదివినట్టు ఉన్నారు మన సినిమాలను.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chaitanya — ఆగష్టు 7, 2008 @ 9:39 పూర్వాహ్నం
andukE dAnnni cinema annarEmO andi.nEnu anukutUnE unTA kAnI kotta cinema vasthE mallI hallO unTAnu adenTO ardam kaadu.nice post.:)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా kranthi — ఆగష్టు 7, 2008 @ 9:43 పూర్వాహ్నం
నక్షత్ర పుత్రులు కదా, అందుకే అలా మాయలు చేస్తూ ఉంటారు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా VJ — ఆగష్టు 7, 2008 @ 10:57 పూర్వాహ్నం
బాగుందండి.మీరు నవతరంగం.కాం కు మీ సినిమావ్యాసాలను పంపవచ్చు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 7, 2008 @ 11:12 పూర్వాహ్నం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా meenakshi — ఆగష్టు 7, 2008 @ 3:14 అపరాహ్నం
టపా అదిరింది.. ఇంకా చాలా చాలా వింతలు చూడొచ్చు మన సినిమాలలో.. గంట సేపు ఫైట్ చేసినా
హీరో గారి జుట్టు చెదరక పోవడం.. నిక్కరేసు కొనే వయసులోనే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, (సినిమా – సీతాకోక చిలుక), హీరోయిన్ పక్కన ఉండే మంద అంతా చక్కగా డ్రెస్ వేసుకొంటే .. ఈమె గారు మాత్రం బెత్తెడు గుడ్డ పైన, జానెడు గుడ్డ కిందన కట్టు కోవడం, హీరో గారు చావు బ్రతుకుల్లో లో ఉంటే, హీరోయిన్ గుడి కి వెళ్లి అందరి దేవుళ్లను, దేవతలను బూతులు తిడితే ఆయన గారి చేతుల్లోనూ, కాళ్ళల్లోను చలనం రావడం, చేసే యాగం పూర్తీ కాకమునుపే వర్షం రావడం, హీరో చేసేది పాలేరు పని అయినా బ్రహ్మాండ మైన బంగాళా (ARJUN, PRIYARAAMAN CINIMA KODI RAMA KRISHNA DIRECTOR – సినిమా పేరు గుర్తు లేదు), హీరో రిక్షా తొక్కేవాడు అయిన TERIWOOL ప్యాంటు వేసుకోవడం (చూడుడు NTR సినిమా )… అబ్బో .. ఇక పాటల విషయానికొస్తే…మరి విచిత్రం.. ఒక సినిమాలో చిన్న సైజు పర్వతం లాంటి హీరోయిన్ – జయ చిత్ర – గిర గిరా తిరుగుతుంటీ … హీరో గారు పాడే పాట ఏమిటో తెలుసా… రవి వర్మకే అందని అందానివి… (పాపం రవి వర్మ చనిపోయడ్డు గాని.. బతికి ఉంటే.. సినిమా రీల్ తో ఉరి వేసుకొని చనిపోయే వాడు).. PITY ఏమిటంటే.. ఇలా విమర్శించుతూనే .. ఆ ఆ సినిమాలను వంద రోజులు ఆడించేస్తాం..
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా krishna rao jallipalli — ఆగష్టు 7, 2008 @ 6:23 అపరాహ్నం