Pavani5’s Weblog

జూలై 28, 2008

పధకం శ్రీ…

Filed under: Uncategorized — pavani5 @ 11:56 ఉద.

మన ప్రభుత్వం మనకి ఈమద్య చాలా పధకాలు ప్రకటిస్తోంది వాటిలో కొన్ని …
ఆంధ్రరాష్ట్ర్ర ప్రజల ఆరోగ్యదృష్ట్యా ఆరోగ్య  శ్రీ…(చాలా ఆరోగ్యంగా వున్నారు ప్రజలు డెంగ్యూ, మలేరియాలతో…)
పేదప్రజల కోసం చౌక  శ్రీ … (ఇంతకు ముందు ముప్పై రూపాయలు వుండే కంది పప్పు ఇప్పుడు నలభై నాలుగురూపాయలు ఎంత చౌకో…)
గూడు లేని ప్రజల కోసం రాజీవ్ శ్రీ…(రాజీవ్ గృహకల్ప …. కట్టడం ఎప్పటికయ్యోనో…)
రైతుల కోసం మందు శ్రీ …(మందులు చేల కన్నా రైతులు ఎక్కువగా వాడుతున్నారు…)
పిల్లల కోసం చదువు  శ్రీ…(ఈపధకం వల్ల తల్లిదండ్రులకి బాగా ఖర్చుపెట్టే అవకాశం ఎంతో…)
శ్రామికుల కోసం సారా శ్రీ …(దీనివల్ల తాగి తూగటం తప్ప ఉపయోగం  ఏమిటో…)
మహిళల కోసం పావలా శ్రీ…(ఈ పావలా వెనక కధ ఉహు…)
వృద్దుల కోసం పింఛను శ్రీ…(ఈపధకం కోసం తిరిగి తిరిగి వృద్దుల    పాట్లు ఎన్నని…)
ప్రయాణీకులకోసం ఆటో శ్రీ…(మార్చిన ఆటో మీటర్ల వల్ల ఎవరికి లాభం…)
యువతకోసం పబ్బు శ్రీ…(పబ్బు కల్చర్ అసలు అర్దం కావట్లేదు…)
ప్రతిపక్షాల కోసం తిట్లు శ్రీ…(ఇవి మాత్రం అక్షయ పాత్రలాగ ఎప్పటికి అయిపోవు…)
కేంద్రంకోసం రుణం శ్రీ…(కేంద్రానికి రుణం ఇస్తారని కాదు తీసుకుంటారని…)
వంటింటికోసం గ్యా శ్రీ…(బుక్ చేసాక నెల రోజులకి వస్తే గ్రేటే…)
కరెంటు కోసం వరుణ శ్రీ(అబ్బో ఎన్నియాగాలో….)
ఇన్నిపధకాలు మన కోసం పంచి తన కోసం  పదవిశ్రీ ని మాత్రమే ఉంచుకొన్న మహానుభావుల్ని అభినందిస్తూ…..ఈపధకాలు అన్ని కూడ వాడుకుంటు మనం మాత్రం మన ఓటుశ్రీ ని వారికే వేసి గెలిపిద్దాం….
ఇది ఎవరిని కించపరుస్తూ రాసిందికాదు జస్ట్  ఫన్ కోసం

4 వ్యాఖ్యలు »

  1. 🙂
    ఉచిత మరుగు దొడ్ల పధకం – సోనియా సుఖవిరేచన శ్రీ
    లేక ఇంధిర సులభ్ శ్రీ

    వ్యాఖ్య ద్వారా శివ — జూలై 28, 2008 @ 1:04 సా.

  2. 🙂

    వ్యాఖ్య ద్వారా రాజేంద్ర — జూలై 28, 2008 @ 5:18 సా.

  3. అమ్మాయీ – పల్లవి శ్రీ ! చాలా బాగా చెప్పేవమ్మా ! 😀

    వ్యాఖ్య ద్వారా sujata — జూలై 28, 2008 @ 5:48 సా.

  4. మీరు అసలైనది మరిచి పోయారు.. ప్రతి పథకము కి ముందు కాని, వెనక కాని రాజీవ్, సోనియా, ఇందిర చేర్చడము.. మొన్న ఆ మద్య ఎక్కడో చదివాను.. ఇందిరమ్మ మరుగుదొడ్లు పథకము అని..చంద్రబాబు నాయుడు మార్కెటింగ్ కళలు చూసే నేను అచ్హెరువొందే వాడిని.. కాని ఈ రాజశేఖరుడి ముందు అవి అన్ని కుప్పి గంతులు లా వున్నాయి.. వీళ్ళందరు ప్రపంచము లో నే అత్యున్నత బిజినెస్ స్కూల్ గురువులు కే గురువులు.. ప్రజల కి సేవ చేయడము కూడా వ్యాపారమే… కానిఅ తి త్వరలో వీళ్ళందరని మించిన “మెగా గురువు” గారు రాబోతున్నారు.. ఎందుకంటే వారు దేవుడు నియమించిన రాజకీయ నాయకులు కాబట్టి..ప్రజలు కష్టాల ని చూసిన్ దేవుడు మా అన్నయ్య ని మీ కోసము పంపపోతున్నారు.. ఆయన తన యిన్ని సంవత్సరాల పేరు ప్రతిష్టల ని పక్కన పెట్టి మీకు సేవ చేయడానికి వస్తున్నారు.. ఆయనని తప్పక ఆదరించగలరు.. యిది ఇంకో రకమైన మార్కెటింగ్ కళ అన్నమాట..అంటే నాచ్ిన్ని బుర్ర కి ఒక పెద్ద అనుమానము.. అదేమిటి అంటే , ప్రజల కి సేవ చేయడానికి, ప్రజల కోసము వుద్యమించడానికి ఏమన్న పేరు ప్రతిష్టలు కావాలా?? లేక తిధులు , నక్షత్రాలు, గ్రహాలు, మీన మేషాలు అన్ని లెక్కలు వేయాలా??.సో అందరు ప్రజా సేవ ని వ్యాపారము గా, ఓటర్ల ని కొనుగోలుదారులు గా చూసే వాళ్ళే….మీ పథకాలా పేర్లు మాత్రము బాగున్నాయి.. జాగ్రత్త బాబు గారు హైజాక్ చేస్తారు..

    వ్యాఖ్య ద్వారా Dr. Ram$ — జూలై 28, 2008 @ 6:18 సా.


RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.